14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్ పనులకు నిధులు మంజూరు
మేడ్చల్ నియోజకవర్గంలో గత 14 ఏళ్లుగా అర్థాంతరంగా నిలిచిపోయిన ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు త్వరలోనే మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూ. 50 లక్షల నిధులను విడుదల చేసింది.
మంగళవారం ఉదయం మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 14 ఏళ్లుగా పూర్తి కాకుండా ఉన్న ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి వినతిని దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి రూ. 50 లక్షల నిధులను మంజూరు చేశారు.
ఈ నిర్ణయంతో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా పెరుగుతుండటంతో ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే స్థానికులకు ఎంతగానో ఉపశమనం కలుగుతుందని వారు ఆశిస్తున్నారు.
దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు త్వరలోనే మళ్లీ ప్రారంభమై, వేగంగా పూర్తి అవుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
Post a Comment