పొండేటి యాదగిరి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సహాయం – పొండేటి యాదగిరి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు అబోతుపల్లికి చెందిన పొండేటి యాదగిరి అప్పులబాధతో, ఆర్థిక సమస్యల కారణంగా మరణించాడని సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు అతని కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబానికి సహాయం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ జిల్లా నాయకులు బుడ్డ భాగ్యరాజ్, చందాయిపేట మాజీ సర్పంచ్ స్వర్ణలత కలిసి గురువారం ఉదయం దశదినకర్మ నిర్వహణకు ఆర్థిక సహాయంగా 50 కేజీల బియ్యాన్ని మృతుని భార్య మహేశ్వరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అప్సర్ భాయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి నర్సింగరావు, గుర్రం రాము, గుడిసె సిద్ధిరాములు, పొండేటి స్వామి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబాన్ని ఓదార్చుతూ, వారికి మరింత సహాయం అందించేందుకు ముందుకొచ్చే మంచి హృదయంతో మద్దతుగా నిలబడాలని నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Post a Comment