కొత్తగూడెం ఈద్గాలో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) నమాజ్ రేపు ఉదయం 8.30 గంటలకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని (బోడగుట్ట) సెంట్రల్ వర్క్ షాప్ వద్ద గల ఈద్గా మైదానంలో రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ రేపు సోమవారం ఉదయం గం.8:30లకు నిర్వహించడం జరుగుతుందని ఈద్గా కమిటి అధ్యక్షుడు ఫారూఖ్ యజ్ధానీ పేర్కొన్నారు. ఆదివారం కమిటి సభ్యులతో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ.
ఎండ వేడి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఉదయం 8:30 గంటలకు ముస్లిం అందరూ సమయానికి ఈద్గా మైదానంకు చేరుకోవాలని, నమాజ్ ఆచరించేందుకు వచ్చే ముస్లింలు తమ వెంట తమ తమ జానీ మాజ్ లు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు, ఉర్దూ ఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, ఈద్గా కమిటీ అధ్యక్షులు ఉమర్ షారూఖ్ యజ్దని, ఉపాధ్యక్షులు ఎండి. గౌస్ మోహినుద్దీన్, ఉపాధ్యక్షులు మహమ్మద్ అమీర్, కోశాధికారి మహమ్మద్ యూసుఫ్ జనరల్ సెక్రెటరీ సయ్యద్ అన్వర్ అలీ ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment