దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపునిచ్చారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ వసంత కాలంలో జరుపుకునే నూతన సంవత్సరోత్సవంగా దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, సామరస్యాన్ని, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగాది పండుగ సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టుకునే గొప్ప సందర్భమని, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని దేశ ప్రజలను ఆమె కోరారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని పేర్కొన్నారు.
రైతులు ప్రకృతితో మమేకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనాలని, ఉగాది గొప్ప పర్వదినమని వారు అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఉగాది ఆది పండుగగా ప్రత్యేక స్థానం కలిగి ఉందని, ఈ పండుగ ద్వారా ప్రకృతి నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.
Post a Comment