భార్యను హత్య చేసి సూట్‌కేసులో పెట్టిన భర్త
బెంగళూరులో ఘోరం భార్యను హత్య చేసి సూట్‌కేసులో పెట్టిన భర్త
బెంగళూరులో దారుణమైన హత్య చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ (32) అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆమె శరీరాన్ని సూట్‌కేసులో పెట్టి పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రాకేశ్ సంబేకర్ తన భార్యతో తరచూ గొడవపడేవాడు. గొడవల సమయంలో ఆమె చేయిచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రులకు ఫోన్, నిందితుడి అరెస్టు
హత్య అనంతరం నిందితుడు తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తానే ఆమెను చంపినట్లు ఒప్పుకున్నాడు. దీనిపై ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతడిని మహారాష్ట్రలోని పుణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. భార్యా భర్తల మధ్య సంబంధం, ఘర్షణలకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని బెంగళూరుకు తీసుకువచ్చి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య నగరంలో సంచలనం రేపగా, కుటుంబ కలహాలు ఎంతకైనా దారితీస్తాయని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది.
Post a Comment