తూప్రాన్ మున్సిపల్ సిబ్బందికి ఉగాది ఉత్తమ సేవా పురస్కార అవార్డులు
తూప్రాన్ మున్సిపల్ సిబ్బందికి ఉగాది ఉత్తమ సేవా పురస్కార అవార్డులు
సైనికులు దేశం కోసం సేవ చేస్తే పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారని తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ సిబ్బందికి ఉగాది పర్వదిన సందర్భంగా ఉత్తమ సేవా పురస్కార అవార్డులు తన చేతుల మీదుగా అందజేయడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి ఉగాది పురస్కార అవార్డ్ ప్రధానోత్సవము చేయడం తూప్రాన్ ప్రెస్ క్లబ్ సేవలను అభినందనీయం అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ పట్టణాల్లో, పల్లెల్లో వీధులు శుభ్రంగా ఉండడానికి కారణం కేవలం పారిశుధ్య కార్మికులే అని, అలాంటి వారి సేవలను గుర్తించి సన్మానించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికునికి స్టీల్ వాటర్ బాటిల్ ను తన వంతుగా ఉచితంగా అందజేస్తానని హామీ ఇస్తూ, వెంటనే మూడు నాణ్యమైన మిల్టన్ స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. మిగతా వారికి పంపిణీ చేయడానికి మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత అప్పగించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు విధినిర్వహణలో పడుతున్న కష్టాలు ప్రశంసనీయమని, వారికి అందించే సన్మాన పత్రం మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. తూప్రాన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేయడం సమాజ సేవలో మరో గొప్ప అడుగని పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మండుటెండలో సైతం అహర్నిశలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠాయపాలెం వేణుగోపాల్, భాస్కర్ గౌడ్ లు తమ ధృడ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠాయపాలెం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి జీ. భాస్కర్ గౌడ్, ముఖ్య సలహాదారు డాక్టర్ జానకిరామ్, సీనియర్ జర్నలిస్టులు ఆర్.శివశంకర్ గౌడ్, పి.ఆంజనేయులు గౌడ్, పి.నగేష్ గుప్త, ఎస్.సందీప్ కుమార్, వి.శివ కృష్ణ గౌడ్, సర్గల స్వామి, జయపాల్ రాథోడ్, మచ్చ యాదగిరి, బాలసాయి హరిప్రసాద్, భూషణం చారి, కోవూరు శ్రీనివాస్ గుప్త, మున్సిపల్ మేనేజర్ ఏ. రఘువరన్, మధు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా సీనియర్ జర్నలిస్ట్ కడిమే మోజెస్ వ్యవహరించారు.
Post a Comment