-->

క్రమశిక్షణ, దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ

క్రమశిక్షణ, దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నాగా సీతారాములు

కొత్తగూడెం, పాల్వంచ ఈద్గాల వద్ద రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, రంజాన్ పండుగ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల సమ్మేళనమని పేర్కొన్నారు.

నెల రోజుల పాటు ఉపవాస దీక్ష పాటించిన తర్వాత ఈ పవిత్రమైన రోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ పండుగ ఒక్కరికీ పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరిని ఐక్యంగా కలిపే పవిత్ర సందర్భమని తెలిపారు. సోదరభావంతో మెలగడం, దాతృత్వాన్ని ప్రదర్శించడం రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.

ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని, సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ, ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడగా, ముస్లిం సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలతో పండుగ ఘనంగా కొనసాగింది.

Blogger ఆధారితం.