-->

హిజ్రాల మధ్య తీవ్ర ఘర్షణ పొట్టు పొట్టు కొట్టుకున్న హిజ్రాలు (వీడియో)

హిజ్రాల మధ్య తీవ్ర ఘర్షణ పొట్టు పొట్టు కొట్టుకున్న హిజ్రాలు (వీడియో)


నంద్యాలలో హిజ్రాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. బిక్షాటన విషయంలో జరిగిన విభేదాలు కాస్తా కులానికి మారి, రెండు వర్గాల హిజ్రాలు పోలీసుల సాక్షిగానే ఘర్షణకు దిగారు. పరస్పరం బూతులు తిట్టుకుంటూ, రాళ్లు విసురుతూ, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.


ఈ సంఘటన నంద్యాల పట్టణంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఒక హిజ్రాను మరో గ్రూప్ సభ్యులు చుట్టుముట్టి తీవ్రంగా చితకబాదారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే రాళ్లతో కొట్టుకుంటూ వీరంగం సృష్టించడంతో అక్కడి రోడ్డుపై వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.

హిజ్రాల మధ్య జరిగిన ఈ ఘర్షణను చూసిన పోలీసులు తొలుత నిశ్చలంగా ఉండగా, పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో చివరకు వారు రంగప్రవేశం చేశారు. ఘర్షణలో పాల్గొన్న హిజ్రాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గొడవకు కారణమైన అంశాలను విచారిస్తున్నారు. హిజ్రాల మధ్య బిక్షాటనలో ఉన్న అంతర్గత విభేదాలు తరచుగా ఇలాంటి సంఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.