పండగ పూట విషాదం.. చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
పండగ పూట విషాదం.. చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న వేళ ఊహించని ఘటన అందరినీ విషాదంలో ముంచేసింది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినవారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మౌనిక పిల్లలతో కలిసి చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను బయటికి తీసినప్పటికీ, తల్లి మౌనిక మృతదేహం మాత్రం ఇంకా లభ్యం కాలేదు.
ఈ సంఘటన తెలియగానే గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మౌనిక మృతదేహాన్ని వెలికితీయడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గ్రామంలో పండగ పూట చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో అందరూ విషాదంలో మునిగిపోయారు. గ్రామస్థుల కంట నీరు ఆగడం లేదు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Post a Comment