సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుదాం టియుడబ్ల్యూజె (IJU)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో టియుడబ్ల్యూజె (IJU) సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి నేషనల్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ పాత్రికేయుడు దుద్దుకూరి రామారావు అధ్యక్షత వహించారు. టియుడబ్ల్యూజె (IJU) జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలు, ఇతర పరిణామాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. సమావేశంలో భాగంగా, జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని సమావేశంలో తీర్మానం చేశారు.
అలాగే, భద్రాద్రి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో చర్చలు జరిపిన తర్వాత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడేందుకు, వారి సంక్షేమాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో తీర్మానం చేయబడింది.
ఈ సమావేశానికి టియుడబ్ల్యూజె (IJU) జాతీయ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
Post a Comment