భద్రాచలం ITDA ట్రైబల్ మ్యూజియంలో లంబాడాల దురాగతాలు
భద్రాచలం ITDA ట్రైబల్ మ్యూజియంలో లంబాడాల దురాగతాలు – ఆదివాసి సంఘాల అప్రమత్తత అవసరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలంలోని కొమరం భీం భవన్‌లో జరిగిన సదస్సులో ఆధార్ సొసైటీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జేజే రాంబాబు (జాతీయ అధ్యక్షులు), పోడియం బాలరాజు (రాష్ట్ర నాయకులు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సదస్సులో ప్రసంగించిన నేతలు సేవాలాల్ మహారాజ్ జీవిత విశేషాలను వివరించారు. ఆయన 1739లో మైసూరు (ప్రస్తుతం కర్ణాటక)లో జన్మించి, 1806లో బొంబాయ్ రాష్ట్రంలో (ప్రస్తుతం మహారాష్ట్ర) మరణించారని చెప్పారు. సేవాలాల్ మహారాజ్ గోర్ బంజారాల సామాజిక, మత సంస్కర్తగా, సమాజ నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.
అయితే, ఈ సందర్భంగా కొంతమంది ఆదివాసీ నాయకులు బంజారా సంఘానికి చెందిన సేవాలాల్ మహారాజ్‌ను గిరిజన సంఘ సంస్కర్తగా ప్రాజెక్ట్ చేయడాన్ని వ్యతిరేకించారు. బంజారా, లంబాడీలు భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ, నిజాం పాలనలోనూ పోరాడిన చరిత్ర లేదని వారు అన్నారు. అలాగే, బంజారా సామాజాన్ని గిరిజన రిజర్వేషన్లకు అర్హులుగా గుర్తించడం తగదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపేందుకు భారీగా నిధులు కేటాయిస్తుండడం అభ్యంతరకరమని ఆదివాసీ నేతలు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఖర్చు చేయకుండా జయంతి నిర్వహిస్తాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
అంతేకాదు, భద్రాచలం ITDA పరిధిలో ఉన్న ఆదివాసీ మ్యూజియంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బంజారా నేతలు కోరుతుండటం అనుచితమని ఆదివాసీ నేతలు వ్యాఖ్యానించారు. సేవాలాల్ మహారాజ్ గారు ఆదివాసీ సంస్కృతికి చెందినవారు కాదని, ఆదివాసీ దేవతల పక్కన ఆయన విగ్రహాన్ని పెట్టరాదని తెలిపారు.
ఈ సమావేశంలో AEWCA రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం వెంకటేశ్వరరావు, ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు కోర్స. జేజే రాంబాబు, రాష్ట్ర నాయకులు పోడియం బాలరాజు, బుగ్గా రామనాధం, పొలెబోయిన వెంకటేశ్వర్లు, ఈసాల కృష్ణయ్య, వర్స లక్షణ్, శంకర్, లింగేశ్వరరావు, పెండెకట్ల రామనాధం, తోలెం వెంకటేశ్వర్లు, మలకం స్వామి, కల్తీ నర్సింహారావు, కుంజా రాంబాబు, పూనెం సమ్మయ్య, పాయం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment