ఢిల్లీ ఘోర ప్రమాదం – నలుగురు మృతి, 10 మంది కాపాడిన రెస్క్యూ బృందం
ఢిల్లీ ముస్తాఫాబాద్‌లో ఘోర ప్రమాదం నలుగురు మృతి, 10 మంది కాపాడిన రెస్క్యూ బృందం
ఢిల్లీ నగరంలోని ముస్తాఫాబాద్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర ప్రమాదం ప్రజలను కలచివేసింది. ముస్తాఫాబాద్ ప్రాంతంలోని ఓ పాత నాలుగంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో భవనంలో చాలా మంది నివాసం ఉండగా, దాదాపు నలుగురు వ్యక్తులు ఈ భవన కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందిని రెస్క్యూ బృందాలు సమయస్ఫూర్తితో స్పందించి భద్రంగా బయటకు తీసుకువచ్చాయి. వీరిలో కొంతమందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సర్వీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి. భవనం శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉండవచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ భవనం కూలిపోవడానికి కారణంగా ప్రాథమికంగా భవన నిర్మాణ నాణ్యత లోపమే కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది. శిథిలాల మధ్య ఇంకా ఎవ్వరైనా ఉండి ఉండవచ్చన్న ఆందోళనతో రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.
Post a Comment