-->

నేతకాని హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

 

నేతకాని హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నేతకాని హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

భూపాలపల్లి, భారతరత్న, రాజ్యాంగ రూపకర్త, తొలి నాయి శాఖ మంత్రి, తత్వవేత్త, చరిత్రకారుడు, బడుగువర్గాల మానవహక్కుల కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నేతకాని హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గజ్జె రాజ్ కుమార్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, "అంబేద్కర్ గారి ఆదర్శాలను అనుసరిస్తూ అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది," అని పేర్కొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేతకాని సంఘం సీనియర్ నాయకులు చల్లూరి సమ్మయ్య, జిల్లా కార్యదర్శి జాడి అశోక్, భౌతు రాజేష్, చల్లూరి కమలాకర్, జిల్లా యూత్ అధ్యక్షులు రమేష్, దుర్గం బిక్షపతి, రఘు, జిల్లా యూత్ సెక్రటరీ విజయ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ దుర్గం అనిల్, ఆకుదారి జాడి, సర్వీస్ మనోహర్, భౌతి కుమార్, దుర్గం రాజు, దుర్గం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేతకాని హక్కుల పోరాట సమితి సభ్యులకు ప్రజలు అభినందనలు తెలియజేశారు. అంబేద్కర్ గారి ఆలోచనలు యువతలో స్పూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

Blogger ఆధారితం.