హనుమకొండలో బస్సు ప్రమాదం – 15 మందికి గాయాలు
హనుమకొండ : జిల్లాలోని హసన్‌పర్తి మండలంలోని చింతగట్టు రింగ్‌రోడ్ వద్ద ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుండి అదిలాబాద్‌కు హనుమకొండ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
బస్సు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాద సమయంలో రోడ్డు మీద మోస్తరు మేఘావృత వాతావరణం నెలకొని ఉండడం, మలుపు వద్ద డ్రైవర్‌కు నియంత్రణ కోల్పోవడం వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గత కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత కలవరం రేకెత్తిస్తోంది. ప్రయాణికుల భద్రత కోసం సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment