-->

చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు"ను ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు

చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు"ను ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు


విజయవాడ: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత మరియు పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో "చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు"ను ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ వేడుకలు విజయవాడ గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరగనున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ మరియు సిఫా సంస్థల ఆధ్వర్యంలో, కనివిని ఎరుగని రీతిలో ఈ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు, శాసన సభ్యులు, మరియు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.

గతంలో 2000వ సంవత్సరంలో స్వర్ణోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించిన వెంకటరమణ, ఈ సంవత్సరం 2025లో వజ్రోత్సవాలను విజయవాడలో నిర్వహించడం విశేషం. ఇలాంటి మహత్తర కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తూ, కళల అభివృద్ధికి వెంకటరమణ విశేష కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి అమృత వర్షిణి (ప్రధాన కార్యదర్శి), శ్రీమతి గుడివాడ లహరి (కార్యనిర్వాహకురాలు), డా. కొండి శెట్టి సురేష్ బాబు, డా. అశోక్ కొప్పుల, డా. సయ్యద్ జాఫర్, శొంఠి ఈశ్వరి, భవాని కపూర్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలియజేశారు.


Blogger ఆధారితం.