ఆకాశంలో "స్మైలీ ఫేస్" – ఏప్రిల్ 25న ఖగోళ అద్భుతం
ఈ నెల 25వ తేదీన మన ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో శుక్రుడు (వెనస్), శని (సాటర్న్) గ్రహాలు మరియు చంద్రుడు ఒకే రేఖలో ఏర్పడతాయి. ఇవి నెలవంకను అనుసరించి ఏర్పడే త్రిభుజాకార నిర్మాణంలో ఉంటాయి, దీని ఫలితంగా ఆకాశంలో ఒక "స్మైలీ ఫేస్" మాదిరి కనిపిస్తుంది.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను సూర్యోదయానికి ముందే చూడాల్సి ఉంటుంది. NASA ప్రకారం, ఈ సమయానికి ఆ గ్రహాలు భూమికి అతి చేరువగా ఉంటాయి మరియు చాలా కాంతివంతంగా కనిపిస్తాయి. దీంతో మనం వాటిని మన కళ్లతోనే స్పష్టంగా చూడవచ్చు. అయితే, బినాక్యులర్ లేదా టెలిస్కోప్ వాడితే ఈ దృశ్యం మరింత స్పష్టంగా, క్లారిటీతో కనిపించనుంది.
ఇది ఖగోళ ప్రియులు, భౌతిక శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారికి ఒక అపూర్వ అవకాశం. సహజంగా ఇలా గ్రహాలు, చంద్రుడు ఒకే సమయానికి ఇలా అందంగా సమ్మిళితమవటం చాలా అరుదు. అందువల్ల, ఇది తప్పక చూడదగిన దృశ్యమే. ఈ అద్భుతాన్ని మీరు కూడా మిస్ కాకుండా చూడండి!
Post a Comment