-->

పాలకొయ్య తండాలో 27వ సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభం

పాలకొయ్య తండాలో 27వ సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభం


నవ లిమిటెడ్, పాల్వంచ సహకారంతో పాలకొయ్య తండాలో 27వ సురక్షిత మంచినీటి కేంద్రంను ప్రారంభించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు 

పాల్వంచలోని ప్రముఖ సంస్థ నవ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలకొయ్య తండాలో 27వ సురక్షిత మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని నేడు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.

గ్రామస్థులు స్వయంగా ఈ ప్రాజెక్ట్ కోసం తీర్మానం చేసి నవ లిమిటెడ్ యాజమాన్యాన్ని సంప్రదించగా, సంస్థ వెంటనే స్పందించి ఈ కేంద్రాన్ని నిర్మించి పూర్తిచేసింది. అనంతరం గ్రామ పంచాయతీకి దీనిని అప్పగించడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ చర్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి శాసనసభ్యులు మాట్లాడుతూ, ‘‘కలుషితమైన నీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ సురక్షిత మంచినీటి కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి’’ అని సూచించారు. అలాగే నవ లిమిటెడ్ చేపడుతున్న ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో సి. యస్. ఆర్. జనరల్ మేనేజర్ ఎం. జి. ఎం. ప్రసాద్, చీఫ్ లైజన్ ఆఫీసర్ వి. ఖాదరేంద్ర బాబు, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ వివేక్, డి. జి. ఎం. గిరిధర్ఇంజనీర్ ఎన్. శ్రీనివాస్సి. హెచ్. శ్రీనివాసరావుషాబీర్ పాషా, ఇతర ప్రభుత్వ అధికారులు, సి. యస్. ఆర్. సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవం గ్రామ ప్రజల్లో సానుకూల స్పందనను కలిగించింది. మంచి నీటి కోసం గల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ పథకం, గ్రామ అభివృద్ధికి మరొక మైలురాయి అయింది.


Blogger ఆధారితం.