45 ఏళ్ల తల్లి ఘాతుకం: పిల్లలకు విషం పెట్టి హత్య
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన తల్లి హత్యాచారం స్థానికులను కలవరపరిచింది. వివాహేతర సంబంధం నడుపుతున్న తల్లి ముగ్గురు పిల్లలను హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
వివరాలు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన రజిత (45) తన పిల్లలను హత్య చేయడానికి పథకం వేసింది. ఇటీవల ఆమె 10వ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో తన స్నేహితుడితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. భర్త చెన్నయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన రజిత తన పిల్లల్ని హతమార్చి ప్రియుడితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది.
ఘటన వివరాలు: ఈ నెల 27న రాత్రి భోజనం సమయంలో, పిల్లలకు పెరుగన్నం పెట్టడానికి రజిత విషపదార్థం కలిపింది. అయితే, భర్త చెన్నయ్య భోజనం చేయకుండా వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రజిత ముగ్గురు పిల్లలైన సాయికృష్ణ (12), మధు ప్రియ (10), గౌతమ్ (08)లకు విషపూరిత పెరుగన్నం ఇచ్చింది. రాత్రి 2 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చిన చెన్నయ్య, పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు.
పోలీసుల విచారణ: తనకు కడుపు నొప్పిగా ఉందని చెబుతూ రజిత ఆసుపత్రిలో చేరింది. మొదట చెన్నయ్యపై అనుమానం వచ్చినా, పోలీసులు ఆచితూచి విచారణ జరిపారు. విచారణలో రజిత బాగోతం బయటపడింది. తన ప్రియుడితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో పిల్లలను హతమార్చిందని అంగీకరించింది.
ప్రియుడు అదుపులో: రజిత వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన గ్రామస్థులను, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు మరింత సమాచారం కోసం దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Post a Comment