సిలిండర్‌పై రూ.50 పెరగడంతో వినియోగదారులపై భారం
నేటి నుంచి అమల్లోకి పెరిగిన గ్యాస్ ధరలు
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ పెంపు మంగళవారం (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుంది. గృహ వినియోగానికి వినియోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 మేర ధర పెరిగింది.
ఇంతకు ముందు తెలంగాణలో సాధారణ సిలిండర్ ధర రూ.874గా ఉండగా, తాజా పెంపుతో అది రూ.924కి చేరుకుంది. ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి సంబంధించిన సబ్సిడీ సిలిండర్ల ధర కూడా పెరిగింది. ఉజ్వల లబ్ధిదారులకు ఇంతకు ముందు రూ.500కు లభిస్తున్న సిలిండర్, ఇప్పుడు రూ.550కి లభించనుంది.
ప్రస్తుత ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, నిన్న (ఏప్రిల్ 7) వరకూ ఆన్‌లైన్‌లో సిలిండర్ బుకింగ్ చేసిన వారు కూడా ఈ రోజు డెలివరీ పొందితే, అదనంగా రూ.50 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెలా ప్రారంభంలో లేదా మధ్యలో గ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకోవడం సాధారణమైనదే అయినా, వరుసగా పెరుగుతున్న ధరలు మధ్యం తరగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారింది.
పెట్రోలియం కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, మారకద్రవ్య మార్పిడీ రేట్లు తదితర అంశాలపై ఆధారపడి గ్యాస్ ధరలను నిర్ణయిస్తున్నాయని తెలిపాయి.
Post a Comment