-->

తైవాన్‌ మరోసారి భూకంపంతో వణికింది రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో ప్రకంపనలు

తైవాన్‌ మరోసారి భూకంపంతో వణికింది రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో ప్రకంపనలు

రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో ప్రకంపనలు – ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి

తైవాన్‌ను వరుసగా భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం అక్కడ 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ ప్రకంపనలు రాజధాని తైపీ సహా పలు ప్రాంతాల్లో స్పష్టంగా నమోదు అయ్యాయి. భూకంపం కారణంగా ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించడంతో వాతావరణంలో ఆందోళనాకరమైన పరిస్థితి ఏర్పడింది.

యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంప కేంద్రం తైవాన్ ఈశాన్య తీరంలోని యిలాన్ ప్రాంతానికి ఆగ్నేయంగా 21 కిలోమీటర్ల దూరంలో, భూమికి 69 కిలోమీటర్ల లోతులో నమోదు అయిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తైవాన్‌లో వరుసగా ప్రకంపనలు నమోదు కావడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. ఈ నెల 3, 4 తేదీల్లో కూడా ఇలాంటి ప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే.

తాజా భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ నమోదు కాలేదని స్థానిక అధికారులు తెలిపారు. అయినప్పటికీ, భవనాల నిర్మాణ స్థితి, భద్రతలపై పరిశీలనలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

ఇక మేము మర్చిపోలేని మరో విషాద ఘటన – మార్చి 28న థాయిలాండ్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో సంభవించిన 7.7 తీవ్రత గల భారీ భూకంపం. ఇది దాదాపు 3,600 మందిని బలి తీసుకుంది. 5,000 మందికిపైగా గాయపడ్డారు. ఈ భూకంపం అనేక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యేలా చేసింది. విద్యుత్‌, టెలిఫోన్‌ లైన్లు తెగిపోయాయి. ప్రస్తుతం 20 దేశాల నుంచి వచ్చిన 1,738 మంది సహాయక సిబ్బంది పునరావాస, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 653 మంది ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విధంగా పశ్చిమ తూర్పు ఆసియా ప్రాంతం మరోసారి ప్రకృతి ప్రకోపానికి వణికిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనల నుంచి రక్షణ పొందాలంటే భూకంప నిరోధక మౌళిక సదుపాయాల ఏర్పాటు కీలకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.