-->

సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిదా...

సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిదా...

మట్ట పవన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా సమయం నుండి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని ప్రతినెలా ఇవ్వడం జరుగుతుందని, రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని ఇస్తామని నరేంద్ర మోడి ప్రభుత్వం చెప్పడం జరిగిందని పవన్ రెడ్డి గుర్తు చేశారు.

ఈరోజు ఇళ్ళందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో రేషన్ షాపును మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణా రెడ్డి మరియు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యానికి 1 కిలో బియ్యం కలిపి ఇచ్చి మొత్తం వాళ్ళే ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చెప్పుకోవడానికి చేసింది ఏమిలేక రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం కోసం 6 కిలోల సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు రేషన్ షాపుల వద్దకు వెళ్లి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని పవన్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఉచిత బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతో తెలుపాలని సవాలు విసిరారు.

కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి సొమ్మొక్కడిది, సోకొక్కడిది లాగా ఉందని చురకంటించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం కృషి చేయాలని పవన్ రెడ్డి సూచించారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పవన్ రెడ్డితో పాటు మండల బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి రమణా రెడ్డి, నాయకులు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, అబ్బిడి తిరుపతిరెడ్డి, వట్టపల్లి సంజీవ్, రామంచ సంపత్, మట్ట నారాయణ రెడ్డి, కొక్కుల దేవేందర్, బుర్ర మల్లయ్య, వట్టపల్లి శరత్ చంద్ర, బ్రహ్మానందం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.