వాసవి క్లబ్ బీబీపేట ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం
బీబీపేట వాసవి క్లబ్ ప్రాంగణంలో RVM హాస్పిటల్, ములుగు వారు, వాసవి క్లబ్ బీబీపేట మరియు VT ఠాకూర్ మెమోరియల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ శిబిరంలో వివిధ రోగలక్షణాలతో వచ్చిన ప్రజలకు నిపుణులైన వైద్య బృందం వైద్య సేవలు అందించారు.
ఈ వైద్య శిబిరంలో మొత్తం 365 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 72 మంది రోగులను మరింత సన్నిహిత పరిశీలన మరియు చికిత్సల కోసం RVM హాస్పిటల్, ములుగు కు ఉచిత బస్సు సౌకర్యంతో రేపు తరలించనున్నారు. అక్కడ వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, అవసరమైతే శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా నిర్వహించబడతాయని RVM నిర్వాహకులు లక్ష్మణ్, సంతోష్, మురళి మరియు గణేష్ తెలియజేశారు.
ఈ శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో వాసవి క్లబ్ బీబీపేట అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, పెద్ది నాగేశ్వర్, ఎర్రం ప్రసాద్, బచ్చు రామచంద్రం, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా వాసవి క్లబ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ కూడా ఈ శిబిరానికి హాజరై శిబిరాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలు ఈ ఆరోగ్య శిబిరాన్ని విశేషంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పల్లె ప్రజలకు మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు.
Post a Comment