నల్లగొండ నగరంలో దారుణ హత్య
నల్లగొండ నగరంలో దారుణ హత్య, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో హృదయవిదారక ఘటన
నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దారుణమైన హత్య సంఘటన కలకలం రేపింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో గల గీతాంజలి కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని అత్యంత క్రూరంగా నరికి హత్య చేశారు.
హత్యకు గురైన వ్యక్తిని మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని సురేష్ (వయసు 37)గా గుర్తించారు. సమాచారం మేరకు, మాస్కులు ధరించిన దుండగులు అకస్మాత్తుగా ఆయనపై వేట కత్తులతో విచక్షణ లేకుండా దాడి చేశారు. గుండెల్లో పొడిచిన అనంతరం మెడపై తీవ్రంగా కొట్టిన దుండగులు, సురేష్‌ను దారుణంగా హతమార్చారు. సురేష్ ప్రాణాలను రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, హత్యదారుల దాడికి లోనయ్యారు.
ఈ దారుణ ఘటనలో నల్లగొండ పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. టూ టౌన్ పోలీసులు హత్యకు గల కారణాలను తెలుసుకునే క్రమంలో పాత కక్షలు, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ శివరాం రెడ్డి, అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు భయాందోళనకు లోనవుతుండగా, హత్యకు పాల్పడిన వ్యక్తుల పట్టుబడాలని కోరుతున్నారు.
Post a Comment