ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో గోదావరిఖనిలో శాంతియుత పాదయాత్ర
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, జమాత్-ఇ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖాసిం రసూల్ ఇలియాస్, ముజ్తబా ఫారూఖ్ ఆదేశాల మేరకు, గోదావరిఖనిలో శాంతియుత పాదయాత్రను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం 11-04-2025 (శుక్రవారం) నాడు మధ్యాహ్నం 2:00 గంటలకు గోదావరిఖని అశోక్ నగర్ లోగల మజీదె అహలె హదీస్ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుండి మెయిన్ చౌరస్తా మీదుగా పాదయాత్ర సాగి, రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర సాయంత్రం 4:00 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగుతుంది.
ఈ సందర్బంగా గోదావరిఖని జామా మసీదు అధ్యక్షులు మహ్మద్ ఫసియుద్దీన్ మాట్లాడుతూ, “ముస్లిం సమాజ సమస్యలపై అధికారులకు శాంతియుతంగా తమ మనోభావాలను తెలియజేయడం లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాము. అందుచేత అన్ని మసీదుల ముస్లింలు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు.
శాంతియుతంగా, ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు లేకుండా ఈ కార్యక్రమం ముగియాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.
Post a Comment