-->

వక్ఫ్ బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

వక్ఫ్ బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్


న్యూఢిల్లీ, వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగా, తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం పక్షాల తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిజాం పాషా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాల్సిందిగా కోరిన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. త్వరలోనే ఈ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ ప్రారంభించనున్నట్లు కోర్టు తెలిపింది.

వక్ఫ్ బిల్లు ముస్లిం మైనారిటీల హక్కులకు భంగం కలిగించవచ్చని పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ, నిర్వహణపై కొత్తగా రూపొందించిన ఈ బిల్లులో పలు అంశాలు అసమ్మతి కలిగిస్తున్నాయి. దీనిపై న్యాయ విచారణ ప్రారంభించడాన్ని రాజకీయ వర్గాలు, ముస్లిం సంఘాలు కీలకంగా పరిగణిస్తున్నాయి.

ఈ విచారణతో వక్ఫ్ బిల్లుకు సంబంధించి మరో మలుపు తిరగనుండగా, త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరుగనుంది.

Blogger ఆధారితం.