మందుబాబులకు గుడ్ న్యూస్! ఇక ఇన్స్టాంట్ బీర్ కేఫ్లు
తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టాంట్ బీర్ కేఫ్లు (Instant Beer Cafes) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, నగరాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జిల్లా కేంద్రాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక కేఫ్ ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్‌లో ముందుగా ప్రారంభం!
హైదరాబాద్‌లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తదనంతరం జిల్లాలకు కూడా ఈ విధానం విస్తరించనున్నారు.
ఇన్స్టంట్ బీర్ ఎలా తయారవుతుంది?
ఈ కేఫ్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి మైక్రో బ్రూవరీ (Micro Brewery) సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. అంటే, బీర్‌ను అక్కడికక్కడే తయారు చేసి వినియోగదారులకు అందిస్తారు. ఇది ఫ్రెష్ గా ఉండటంతో పాటు, సాంప్రదాయ బీర్ కంటే మెరుగైన రుచిని కలిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ నిర్ణయం మందుబాబులను ఎంతగానో ఆకర్షించనుంది. అయితే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సిందే!
Post a Comment