-->

ఎమ్మెల్యే కూనంనేని చైతన్య యాత్ర కరపత్రం ఆవిష్కరణ

ఎమ్మెల్యే కూనంనేని చైతన్య యాత్ర కరపత్రం ఆవిష్కరణ
అంబేద్కర్ జయంతిలో ఎమ్మెల్యే కూనంనేని చైతన్య యాత్ర కరపత్రం ఆవిష్కరణ

ఎస్సీ కులాలకు రాజకీయ న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

కొత్తగూడెం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద సోమవారం (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల చైతన్య యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ, గత ప్రభుత్వాలు ఎస్సీ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వంటి స్థానిక సంస్థల స్థానాల్లో ఎస్సీ కులాల స్థానాలను జనరల్ కేటగిరీలో కలిపివేయడం వల్ల వారిపై తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ఈ అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత ఉంది. ఎస్సీ, బీసీ కులాలకు రాజకీయ న్యాయం కల్పిస్తూ, తగిన రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నా,” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శాసనసభలో ఎస్సీ హక్కుల విషయాన్ని ఎత్తి చూపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్యాయం సరి చేయించేవరకు ఆయన మా అండదండగా ఉండాలని కోరుతున్నాం,” అని అన్నారు.

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కాకెళ్లి సైమన్, గౌరవ సలహాదారులు మద్దెల శివకుమార్, మాజీ జెడ్పీటీసీ పరంజ్యోతి రావు, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్ మారపాక రమేష్ కుమార్, కూసపాటి శ్రీనివాస్, బొంకూరి పరమేష్, చదలవాడ సూరి, చిన్ని, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, రజిని అంబేద్కర్, సలిగంటి కొమరయ్య, కత్తి బాలకృష్ణ, కండే రాములు, ఎనగంటి శ్రీను తదితరులు ఉన్నారు. అంబేద్కర్ ఆశయాల అమలే నిజమైన నివాళి అని అందరూ పేర్కొన్నారు.

Blogger ఆధారితం.