రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం తీవ్రంగా చోటుచేసుకోవడంతో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు అధికార పనుల నిమిత్తం వెళ్తున్న రమాదేవి ప్రయాణిస్తున్న కారు యర్రగుంట్ల వద్ద ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రమాదేవి మృతిపై కలెక్టరేట్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అధికారులు, సహచర ఉద్యోగులు ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Post a Comment