-->

నేడు భద్రాచలం రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నేడు భద్రాచలం రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు భద్రాచలం పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు జరగనున్న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి, పవన్ కళ్యాణ్ ఒక రోజు ముందే ఖమ్మం జిల్లా చేరనున్నారు.

భద్రాచలంలో జరిగే ఈ పవిత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ తరఫున ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆ భాద్యతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చేపడుతున్నారు.

ఇందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న తన నివాసం నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో భద్రాచలానికి చేరుకునే అవకాశముంది.

రేపు, ఏప్రిల్ 6న పవన్ కళ్యాణ్ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని, భద్రాద్రి శ్రీరామచంద్రస్వామికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అదే రోజున సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటల కల్లా మళ్లీ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.

ఇక ఈ వేడుకలకు సంబంధించి భద్రాచలంలో ఇప్పటికే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర రాష్ట్ర మంత్రులు కూడా భద్రాచలం చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, సమగ్ర ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

Blogger ఆధారితం.