-->

కొత్తగూడెంలో మత సామరస్యం చాటిన ముస్లింలు

 

కొత్తగూడెంలో మతసమరస్య చాటిన ముస్లింలు

సీతారాముల కల్యాణం సందర్బంగా మాజీ కౌన్సిలర్లు ఎస్.కె మసూద్, జయంతి మసూద్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, దద్దోజనం, మంచినీరు, కేసరి పంపిణీ

భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరై భద్రాచలం వచ్చిన వేలాదిమంది భక్తులకు ఓ మంచి ఉదాహరణగా మతసహిష్ణుత్వం చాటుతూ స్థానిక ముస్లిం యువకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కష్టపడి ప్రయాణించి వచ్చిన భక్తులకు ఉపశమనం కలిగించేందుకు ముస్లిం యువత మజ్జిగ, దద్దోజనం, కేసరి, మంచినీరు వంటి పదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. వీరి ఈ చర్య భక్తులకు మానసికంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది.

ఇది మతాల మధ్య ఉన్న ఐక్యతకు బంధానికి అద్భుత ఉదాహరణగా నిలిచింది. మతభేదాలు లేకుండా అందరికీ సహాయం చేయాలన్న స్ఫూర్తితో చేసిన ఈ కార్యం సామాజికంగా ప్రశంసలకు పాత్రమవుతోంది.

స్థానిక హిందూ భక్తులు, పెద్దలు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఇది నిజంగా మతసమరస్యానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సలాం, ముజ్జు, యూసుఫ్, అన్వర్, బబ్బు, సాదిక్ పాషా, సలీమ్, మజీద్, కిట్టు, ఖాదర్, ఇబ్రహీం, అరిఫ్, కోనేరు పూర్ణచందర్ రావు, ఆళ్ల మురళి, శ్రీనివాస్ రెడ్డి, పునేం శ్రీనివాస్, నాగేంద్ర త్రివేది, తోట దేవిప్రసన్నతదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.