కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానా
కొత్తగూడెం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పరువురు వ్యక్తులకు జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పు వెల్లడించారు.
కేసుల వివరాలు:
పాల్వంచ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య బుదవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పాల్వంచ టౌన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం సేవించి తమ వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, వారు మితిమీరిన మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది.
అనంతరం, పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి మెండు రాజమల్లు వారిపై జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నేరస్తులకు విధించిన ఈ చర్య ఇతరులకు గుణపాఠంగా మారనుందని పోలీసులు పేర్కొన్నారు.
Post a Comment