బీటెక్ విద్యార్థిని కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆత్మహత్యకు ముందు కృష్ణవేణి తన తల్లితో కలిసి హాస్టల్ గదిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని గంటలకే ఆమె కాలేజ్ భవనం పైకి వెళ్లి దూకడం చుట్టుపక్కల వారిని షాక్‌కు గురిచేసింది. ఈ విషాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాలేజ్ యాజమాన్యం వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమా? లేక కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణ నిర్ణయం తీసుకుందా? అన్న కోణాల్లో విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మదిలో అనేక సందేహాలు కొనసాగుతున్నాయి.
కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాలేజ్ యాజమాన్యానికి సంబంధించినవారిని, హాస్టల్ సిబ్బందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. పూర్తి నివేదిక వచ్చే వరకు విద్యార్థుల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Post a Comment