-->

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయండి కొప్పుల ఈశ్వర్

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయండి కొప్పుల ఈశ్వర్

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయండి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు

వరంగల్ లో ఏప్రిల్ 27న జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను గ్రాంధియంగా నిర్వహించి, పార్టీ శక్తిని మరోసారి దేశానికి చాటిచెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, ఇది ప్రతి గులాబీ కార్యకర్తకు గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మాట్లడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –

“పార్టీ పుట్టిన నాటి నుంచి తెలంగాణ ప్రజల కలలు నిజం చేసేందుకు కేసీఆర్ గారు తీసుకున్న అనేక అడుగులు, అందించిన ప్రగతి దిశగా ప్రజలు మర్చిపోలేరు. ఇప్పుడు రజతోత్సవ వేళ, పార్టీ శక్తి సామర్థ్యాలను నిరూపించే సమయం ఇది. ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడాలి. ధర్మపురి నుంచి వేలాది మందితో వరంగల్ సభకు చేరాలి” అని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన ఈశ్వర్ – “ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. పాలనలో స్పష్టత లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం నిశ్చితంగా ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని ఖండించిన ఆయన – “పార్టీ కార్యకర్తలకు అండగా మేము నిలుస్తాం. వారి పట్ల అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“గత రెండు దశాబ్దాలలో బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. రాబోయే రోజుల్లోనూ అదే దిశగా కొనసాగించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సమష్టిగా పనిచేయాలి” అని కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.