-->

నయీమ్ ఖురేషికి గౌరవ డాక్టరేట్ పురస్కారం

 

నయీమ్ ఖురేషికి గౌరవ డాక్టరేట్ పురస్కారం

నయీమ్ ఖురేషికి గౌరవ డాక్టరేట్ పురస్కారం  

కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకుడు నయీమ్ ఖురేషి గౌరవ డాక్టరేట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు స్వయంగా అందజేశారు.

ఈ గౌరవాన్ని ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ యూనివర్సిటీ వర్తించగా, నయీమ్ ఖురేషి గత 15 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా చేస్తున్న అనేక సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌ ను ప్రకటించింది. పరిశ్రమల రంగంలో సత్తా చాటుతూ, తన తండ్రి స్వర్గీయ రహీం ఖురేషి అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన నయీమ్ ఖురేషి, అనేక పేద ప్రజలకు అండగా నిలిచారు.

ఈ సందర్భంగా నయీమ్ ఖురేషి మాట్లాడుతూ – "నా సేవలకు గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఎంతో అభిమానించే నాయకుడు కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అన్నారు. అలాగే ఈ గౌరవాన్ని అందజేసిన యూనివర్సిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, అబ్దుల్ రబ్, జమాత్ ఇస్లామే హిందీ జిల్లా అధ్యక్షులు ఉమర్ యాజ్దని, కొత్తగూడెం జమాత్ ఇస్లామీ హింద్ అధ్యక్షులు జహంగీర్, ఉర్దూ ఘర్ కార్యదర్శి ఎండీ షరీఫ్, అంజుమన్ అధ్యక్షులు అమీర్ ఖాద్రి, కాంగ్రెస్ జిల్లా మైనారిటీ కార్యదర్శి ఎండీ ఖమర్, ఎండీ మొయిన్, బాబుజని ఖాన్, ఎండీ జమాల్, ఎండీ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందడి మరియు ఘనతతో సాగింది. నయీమ్ ఖురేషికి పలువురు అభినందనలు తెలిపారు.

Blogger ఆధారితం.