హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచార ముఠాలు వెలుగు
హైదరాబాద్, : నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన పోలీసులు తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రధానంగా బంగ్లాదేశ్ యువతులను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి వ్యభిచారానికి ఉపయోగిస్తున్న ముఠాల దందా బయటపడింది. ఈ సంఘటనలు వెలుగులోకి రాగానే దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా విచారణ చేపట్టాయి. బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ముఠాల్లో పశ్చిమ బెంగాల్ కీలక భూమిక పోషిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
పశ్చిమ బెంగాల్ నుంచి అక్రమ రవాణా
దర్యాప్తులో నిధుల ఆధారంగా బయటపడిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి అనే వ్యక్తి ఈ ముఠాకు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. అతను బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, యువతులను అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి తరలిస్తున్నాడు. ఒక్క వ్యక్తిని దేశంలోకి ప్రవేశింపజేయడానికి రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ వసూలు చేస్తున్నారు.
నోట్ల మార్పిడి – బ్యాంకుల ద్వారా నగదు
ఈ రవాణా వ్యవహారం పూర్తిగా రాహుల్ నియంత్రణలో నడుస్తోంది. యువతుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బును బంగ్లాదేశ్‌లోని దుకాణదారుల ద్వారా భారత కరెన్సీగా మారుస్తున్నారు. కొంత డబ్బు యూపీఐ లేదా బ్యాంకు ఖాతాల ద్వారా రాహుల్‌కు చేరుతుంది. అందులోంచి రూ.1,000 కమిషన్ రూపంలో స్థానిక అనుచరులకు ఇస్తున్నారు. వారు యువతులను తగిన ప్రదేశానికి చేరవేస్తున్నారు.
నకిలీ గుర్తింపు కార్డులు – కొత్త జీవితం?
దేశంలోకి వచ్చాక, ఈ యువతులకు నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు తయారు చేయించడంతో వారు భారత పౌరుల్లా జీవిస్తున్నట్టు కనిపిస్తోంది. రాహుల్ ఈ దందాను 2017 నుంచే నడుపుతున్నట్లు సమాచారం. ఇతనికి కోల్‌కతా కేంద్రంగా ఉన్న ముఠాలతో సంబంధాలున్నాయి. వీరి సహకారంతోనే నగరాల్లో వ్యభిచార కూపాలను కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్‌కు తరలింపు – వ్యభిచార ముఠాల్లోకి నెట్టివేత
ఈ యువతులను హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు తరలించి, ఉద్యోగం పేరిట వ్యభిచారంలోకి నెట్టేస్తున్నారు. కొంతమంది మాత్రమే మసాజ్ పార్లర్లు, బార్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. ఈ తరలింపులో కొన్ని ముఠాలు యువకులను కూడా అక్రమంగా భారత్‌లోకి తీసుకువస్తున్నాయి.
దర్యాప్తు విస్తరణ – NIA జోక్యం
ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల్లో దర్యాప్తును మరింత విస్తరిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ఘటనలపై సమగ్ర నివేదికను తయారుచేస్తున్నారు. ఇందులో నెట్‌వర్క్‌లో పాత్రధారుల వివరాలు, వారి కార్యకలాపాలు, సరిహద్దుల్లో చొరబాటు మార్గాలు మొదలైన అంశాలపై స్పష్టతకు వస్తున్నారు. కొన్ని కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించిన నేపథ్యంలో, సంబంధిత దళాలతో సమన్వయం చేసుకుని ముందుగా అడుగులు వేయనున్నారు.
Post a Comment