-->

విమానాన్ని ల్యాండ్ చేసిన వెంటనే పైలట్‌ గుండెపోటుతో మృతి

విమానాన్ని ల్యాండ్ చేసిన వెంటనే పైలట్‌ గుండెపోటుతో మృతి


ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 29 ఏళ్ల యువ పైలట్ అర్మాన్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అర్మాన్ విజయవంతంగా ల్యాండ్ చేశారు. విమానం ఆగిన కొన్ని నిమిషాలకే ఆయనకు తీవ్ర అస్వస్థత కలిగింది. తోటి సిబ్బంది హుటాహుటిన వైద్య సాయం కోసం ప్రయత్నించగా, అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అర్మాన్ మృతి చెంది ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.

విమాన ప్రయాణ సమయంలోనే అతను వాంతులు చేసినట్లు సిబ్బంది గుర్తు చేశారు. అయితే సేవ్‌గా విమానాన్ని ల్యాండ్ చేయడం ఆయన బాధ్యతాపూరిత వృత్తినైపుణ్యానికి నిదర్శనమని, చివరి శ్వాస వరకు విధి నిర్వర్తించాడని విమానయాన శాఖ అధికారులు కొనియాడారు.

ఈ ఘటన పైలట్ వర్గానికే కాదు, మొత్తం విమానయాన రంగానికి షాక్ ఇచ్చింది. యువకుడైన అర్మాన్ ఇలా అకాలంగా చనిపోవడం గుండెను కలచివేసింది. అతని కుటుంబానికి, స్నేహితులకు, సహచరులకు అనేక ప్రముఖులు, సహోద్యోగులు సంతాపం తెలిపారు.

Blogger ఆధారితం.