కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు కోర్టు జరిమానాలు విధింపు
కొత్తగూడెం, లీగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తున్న కొత్తగూడెం ప్రత్యేక న్యాయస్థానం బుధవారం అనేకమంది వ్యక్తులకు జరిమానాలు విధించింది. స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మండు రాజమల్లు ఈ కేసుల్లో తీర్పులు వెల్లడించారు.
కేసుల వివరాలు:
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. రమణారెడ్డి వాహన తనిఖీలు చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు మితిమీరిన మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా, వారిలో మద్యం శాతం నిబంధనలకు మించి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారి పై జరిమానాలు విధించారు.
ఇక కొత్తగూడెం వన్ టౌన్ ఎస్సై విజయ వాహన తనిఖీలు చేస్తుండగా, ఎనిమిది మంది వ్యక్తులు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి, వారిని కూడా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ ఎనిమిది మందికి జరిమానాలు విధించారు.
Post a Comment