సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
అమరావతి, ఏపీ సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముఖ్యంగా రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ సంఘటనపై మొదట ఎస్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందడంతో వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేకపోతే దీని వెనుక కుట్ర కోణం ఉందా? అనే దానిపై పోలీసులు విస్తృతంగా విచారణ జరుపుతున్నారు.
సచివాలయంలోని రెండో బ్లాక్‌లో పలువురు ప్రముఖ మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఈ బ్లాక్‌లోనే ఉన్నాయి.
అగ్నిప్రమాదం తెల్లవారుజామున సంభవించడంతో అదృష్టవశాత్తూ సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేరు. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక దానిలో మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే విషయాన్ని పోలీసులు తేల్చేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వ వర్గాలు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నాయి.
Post a Comment