భద్రాచల కళ్యాణ మహోత్సవం విజయవంతం అన్నీ తానై ముందుండి నడిపిన తుమ్మల
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవం ఈ సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని అశేష భక్తజన సమూహం మధ్య విజయవంతంగా నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కార్యక్రమం ఏర్పాట్ల నుంచి నిర్వహణ దాకా అన్నింటినీ తన భుజాలపై వేసుకుని, సమర్థవంతంగా నిర్వహించడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం తుమ్మలగారికి ఉంది. ఆయనకు ఏ శాఖ ఇచ్చినా అందులో నైపుణ్యం చూపగలిగే తీరు, ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుని, అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే సామర్థ్యం ఆయన ప్రత్యేకత.
ఈ కార్యక్రమాన్ని రెండు రోజులుగా భద్రాద్రి జిల్లాలో తిష్ట వేసి తుమ్మలగారు పర్యవేక్షించారు. అధికారులను సమన్వయం చేస్తూ, ప్రతి చిన్న అంశాన్ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించారు. తుమ్మలగారి పేరు వింటేనే అధికారులు అప్రమత్తమవుతూ, కార్యాచరణలోకి దిగడమే ఆయనకు ఉన్న పరిపాలనా శైలికి నిదర్శనం.
ఇంతకుమించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటీవల ఇంటిలిజెన్స్ విభాగం నిర్వహించిన సర్వేలో ప్రజా ప్రతినిధుల పనితీరుపై ఇచ్చిన నివేదికలో తుమ్మలగారు అగ్రస్థానంలో నిలిచారు. ఇది ఆయనకు ప్రజల మద్దతు ఎంతగా ఉందో, ప్రభుత్వ యంత్రాంగంపై ఆయనకు ఎంత పట్టుందో తెలియజేస్తుంది.
Post a Comment