-->

కొత్తగూడెం టౌన్ కన్వీనర్‌గా మహమ్మద్ గౌస్ నియామకం

కొత్తగూడెం టౌన్ కన్వీనర్‌గా మహమ్మద్ గౌస్ నియామకం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నియామకాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ (AICC) మరియు టీపీసీసీ (TPCC) సూచనల మేరకు, "జై బాపు జై భీమ్ జై సంవిధాన్" కార్యక్రమానికి సంబంధించి మండల కోఆర్డినేటర్లను నియమించారు. ఈ నియామకాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్య అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం టౌన్ కన్వీనర్‌గా మహమ్మద్ గౌస్ నియమితులయ్యారు. ఈ పదవి ద్వారా ఆయన స్థానికంగా పార్టీ కార్యక్రమాలను సమన్వయపరిచే బాధ్యతలను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య కి, కొత్తగూడెం టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి కి, అలాగే పార్టీ అధిష్టానానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, పార్టీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని మహమ్మద్ గౌస్ తెలిపారు. 

ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కట్టుబడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నియామకం పార్టీ శ్రేణులలో హర్షం వ్యక్తమవుతోంది. స్థానికంగా మహమ్మద్ గౌస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Blogger ఆధారితం.