-->

సింగరేణిలో కుల మతాలకు అతీతంగా ఘనంగా ఈద్ మిలాఫ్ వేడుకలు

 

సింగరేణిలో కుల మతాలకు అతీతంగా ఘనంగా ఈద్ మిలాఫ్ వేడుకలు

కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ లో రంజాన్ పర్వదినం సందర్భంగా "ఈద్ మిలాఫ్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కార్మికులు, సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జి.యమ్ (పర్సనల్) శివకేశవ రావు మాట్లాడుతూ, “సింగరేణిలో 'ఒకే కుటుంబం - ఒకే లక్ష్యం' నినాదంతో ప్రతి పండుగను కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే గొప్ప సంప్రదాయం ఉంది. ఇది నేటి సమాజానికి అవసరమైన సాంఘిక ఐక్యతకు ప్రతీక” అని అన్నారు.

డిప్యూటీ జి.ఎం (ఇలక్ట్రికల్ & మెకానికల్) శ్రీకాంత్, ఐన్టీయుసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్ మాట్లాడుతూ, "సృష్టికర్త దేవుడు ఒక్కడే, మానవులందరం ఆయన దాసులమే. రంజాన్ మాసం ఉపవాసాల ద్వారా మానవత్వ విలువలు పెంపొందుతాయి" అన్నారు.

హెచ్.ఆర్.డి యోహాను మాట్లాడుతూ, “మన దేశంలో వివిధ మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నా మనమంతా భారతీయులమే. ఐక్యతతో జీవించడంలోనే ఆనందం ఉంది” అని చెప్పారు.

జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్, ఇస్లామీయ వక్తా సలాం మాట్లాడుతూ, “రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించింది. ఇది మానవాళి మార్గదర్శక గ్రంథం. ఇందులో ఉన్న దైవ సందేశాలు కేవలం ముస్లింల కోసమే కాదు, సమస్త మానవాళి హితమే లక్ష్యంగా ఉన్నాయి” అని వివరించారు.

ఈ కార్యక్రమంలో మురళి, ఇంజనీర్లు శంకర్, అనిల్, ఉపేందర్, పిట్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, సూర్యప్రభ, యాకూబ్, రాంచందర్, కరీం తదితరులు పాల్గొన్నారు. పండుగలు కుల మతాలకు అతీతంగా, ఐక్యతను చాటే విధంగా జరుపుకోవాలని అందరూ ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.