తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల - నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మరో కీలక ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి అవసరమైన తెలంగాణ టెట్ (TET - Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందతారు.
పరీక్షా తేదీలు మరియు ముఖ్యమైన సమాచారం:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 15
- దరఖాస్తుల చివరి తేదీ: ఏప్రిల్ 30
- పరీక్షా తేదీలు: జూన్ 15 నుండి జూన్ 30 వరకు
- ఫలితాల విడుదల: జూలై 22
అభ్యర్థులు సంబంధిత సమాచారాన్ని మరియు దరఖాస్తు ఫారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 15 నుంచి పొందవచ్చు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలు అదే తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఫీజు వివరాలు:
- ఒకే పేపర్ రాసే అభ్యర్థులకు: రూ. 750
- రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు: రూ. 1000
ఈ టెట్ పరీక్షలో పేపర్-1 ప్రాథమిక పాఠశాలల (1 నుండి 5వ తరగతి) కు, పేపర్-2 పై తరగతుల (6 నుండి 8వ తరగతి) బోధనకు అర్హతను నిర్ధారిస్తుంది. కావున, అభ్యర్థులు తమ అర్హతల మేరకు ఒక్క పేపర్ లేదా రెండు పేపర్లు రాయవచ్చు.
ప్రభుత్వం సిద్ధంగా ఉంది:
ఇటీవల బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి స్పష్టత రావడంతో, ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు మరింత అవకాశం లభించింది. టెట్ నోటిఫికేషన్ కూడా అదే ప్రక్రియలో భాగంగా విడుదల చేసినట్లు భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పిన దానిని అమలు చేస్తూ ఈ నోటిఫికేషన్ జారీచేయడం గమనార్హం.
Post a Comment