సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగవంతం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు నేటికి వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించేందుకు, ఆధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పునర్నిర్మాణం, ద. మధ్య రైల్వే పరిపాలనలో వేగంగా పురోగమిస్తోంది.
ఈ ప్రాజెక్టు క్రమంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు కొంతమేర రైళ్ల రాకపోకలకు తాత్కాలిక మార్పులు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, రాబోయే 115 రోజుల పాటు ఐదు ఫ్లాట్‌ఫార్ములు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ఇక ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు, ఈ నెల 15వ తేదీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నడిచే 120 రైళ్లను దశలవారీగా ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. ఈ రైళ్లు చర్లపల్లి టెర్మినల్, నాంపల్లి (హైదరాబాద్ డికన్), కాచిగూడ స్టేషన్ల ద్వారా నడపబడనున్నాయి.
రైలు ప్రయాణికులు ముందుగా తమ ప్రయాణ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి, మారిన షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో వచ్చే ఆరు నెలల పాటు రైళ్ల రాకపోకలకు కొంత మేర అంతరాయం ఏర్పడనుంది. ప్రభుత్వం ఈ పునర్నిర్మాణంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి మోడరన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది. భవిష్యత్తులో ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యంగా మారనుంది.
Post a Comment