-->

రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన నాగా సీతారాములు

 

రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన నాగా సీతారాములు

కొత్తగూడెంలో రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన నాగా సీతారాములు

కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లాలో మే 1 నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు 3 ఇంక్లైన్ లో నిర్వహించనున్న రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని టీపీసీసీ సభ్యులు, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగా సీతారాములు గురువారం సందర్శించారు.

ఈ సందర్శన సందర్భంగా ఆయన శిక్షకులతో మాట్లాడి శిక్షణ శిబిరంలో పాల్గొననున్న బాలబాలికల కోసం అవసరమైన క్రీడా పరికరాలు, సదుపాయాలపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. పిల్లలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రతి చర్య తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా క్రీడా అధికారి ఎం. పరందామ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ క్రీడాకారుల అభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లలో ముందుండి పని చేస్తున్నారని, వారి చొరవతో రెజ్లింగ్ శిక్షణకు అవసరమైన మ్యాట్స్ సైతం శాంక్షన్ అయ్యాయని, త్వరలోనే అవి శిబిరానికి అందించబడతాయని తెలిపారు. అధిక సంఖ్యలో బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని నాగా సీతారాములు కోరారు.

ఈ సందర్బంగా జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఐ. ఆదినారాయణ, కోచ్‌లు టీ. తరుణ్, పి. నిహారిక, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, ఓబీసీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు జయప్రకాష్, ఓబీసీ నాయకులు బొబ్బలు వెంకట్ యాదవ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సాయి చంద్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.