-->

వరంగల్‌లో మెగా జాబ్ మేళా: వేల మందికి ఉద్యోగ అవకాశాలు

వరంగల్‌లో మెగా జాబ్ మేళా: వేల మందికి ఉద్యోగ అవకాశాలు


వరంగల్‌లో శుక్రవారం మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ మరియు సీతక్క కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో దాదాపు 60 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. వీటి ద్వారా సుమారు 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే అది సాధ్యం కాదు. అందుకే యువత ప్రతిభ ఆధారంగా ప్రైవేట్ రంగంలో అవకాశాలను వెతకాలి," అని సూచించారు. అలాగే, "మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ గత ప్రభుత్వం హయాంలో అయినా సరే 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు," అని మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రులు విమర్శలు గుప్పించారు.

ఈ జాబ్ మేళా ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంత్రులు యువతను ప్రోత్సహిస్తూ, "ప్రతిభ ఉందంటే ఉద్యోగం దక్కటం ఖాయం. అలాంటి అవకాశాల కోసం జాబ్ మేళాల్లో తప్పకుండా పాల్గొనాలి," అని తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చిన యువత ఉత్సాహంగా పాల్గొంటూ, తమకు ఉద్యోగ అవకాశాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.