-->

ప్రముఖ నటి శ్రీరెడ్డిని స్థానిక పోలీసులు అదుపులోకి

 

ప్రముఖ నటి శ్రీరెడ్డిని స్థానిక పోలీసులు అదుపులోకి

విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ప్రముఖ నటి శ్రీరెడ్డిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె గతంలో టీడీపీ నేతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆమెను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఆమె కూటమి నాయకులకు క్షమాపణలు చెప్పినప్పటికీ, రాజకీయ వర్గాలు మాత్రం ఆమెపై నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారించుతూ, పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.

ఈ వ్యవహారం మరింత దర్యాప్తుకు దారితీయనుందని సమాచారం. శ్రీరెడ్డి స్పందనపై, భవిష్యత్తులో రాజకీయ వర్గాల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Blogger ఆధారితం.