-->

బీఆర్‌ఎస్‌కు కొత్తగూడెంలో పునరుత్థానం అవకాశం... కాపు సీతా లక్ష్మీ కీలక పాత్రలోకి?

బీఆర్‌ఎస్‌కు కొత్తగూడెంలో పునరుత్థానం అవకాశం... కాపు సీతా లక్ష్మీ కీలక పాత్రలోకి?


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీకి తాత్కాలికంగా ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, మరోసారి పూర్వ వైభవాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీ పట్ల నిబద్ధత చూపుతున్న కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీకు కీలక బాధ్యతలు అప్పగిస్తే, స్థానికంగా పార్టీ బలపడే అవకాశముందని వారు విశ్లేషిస్తున్నారు.

కాపు సీతా లక్ష్మీ గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేసిన సమయంలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల మధ్యలో ఉన్న బలమైన సంబంధాలు, మహిళా శక్తిని సమన్వయం చేయగల సామర్థ్యం ఆమెను జిల్లాలో బీఆర్‌ఎస్‌కు నూతన శక్తిగా నిలిపే అవకాశం కల్పిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లోనూ ఆమెకు విశేష ఆదరణ ఉంది.

ఇటీవలి రాజకీయ పరినామాల దృష్ట్యా, నమ్మకమైన నేతలకు అధిష్ఠాన బాధ్యతలు అప్పగించి, పార్టీకి క్రియాశీలత నింపాలని పలువురు బీఆర్‌ఎస్ నేతలు కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో సీతా లక్ష్మీకు జిల్లా స్థాయిలో గాని, మహిళా విభాగంలో గాని కీలక స్థానం కల్పిస్తే, మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

విశ్లేషకుల మాటలో... "సీతా లక్ష్మీ వంటి నేతలు పార్టీలో ముందుకు వస్తే, ప్రజల్లో తిరిగి విశ్వాసం కలుగుతుంది. స్థానిక సమస్యలపై ఆమె స్పష్టమైన దృష్టి, కార్యకర్తలతోనూ ప్రజలతోనూ నిరంతర సమీక్ష, సమన్వయం బీఆర్‌ఎస్‌కు మళ్లీ బలం కలిగించగలదు," అని ఒక రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.


Blogger ఆధారితం.