-->

ఇంటింటికి బొట్టు పెట్టి బీఆర్ఎస్ సభకు ప్రచారం చేసిన కాపు సీతా లక్ష్మీ దంపతులు

 

ఇంటింటికి బొట్టు పెట్టి బీఆర్ఎస్ సభకు ప్రచారం చేసిన కాపు సీతా లక్ష్మీ దంపతులు

ఇంటింటికి బొట్టు పెట్టి  27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ  రజతోత్సవ  సభకు రమ్మని  ప్రచారం చేసిన కాపు సీతాలక్ష్మీ -కృష్ణ దంపతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వృద్దిరాజు రవిచంద్ర, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు రామవరంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ 27న వరంగల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించనున్న రజతోత్సవ మహా సభకు ప్రజలు వేలాదిగా హాజరయ్యేలా  కాపు సీతాలక్ష్మీ దంపతులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. రామవారం ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలుకుతున్నారు.

 బిఆర్ఎస్ పార్టీ పట్ల గల నిబద్ధతతో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రతి కుటుంబాన్నీ కలిసి సభలో పాల్గొనాలని కోరుతున్నారు. ప్రజలతో బిఆర్ ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసాగించారని అన్నారు, ప్రత్యక్ష ప్రచారం చేయడం స్థానికంగా మంచి ఆదరణ పొందుతోంది.

ఈ దంపతుల సేవా దృక్పథం, పార్టీ పట్ల ఉన్న  అంకితభావం  నమ్మకం ఇతరులకు ప్రేరణగా మారుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ, ఖాజా బక్ష్, షరీఫ్ మధు బాబు జాన్, ఈశ్వరి, సుమ, రమ్య కృష్ణ, తమ్మీశెట్టి నాగమని, పల్లవి, సుల్తానా, కతిజ,  ఆషాపాసి, స్వాతి, నందిని, రాణి, వరలక్ష్మి, వాసుకి, మాలతీ, దేవి, శైలజ, అప్పు, నవత, సుమలత, తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.