-->

పర్యావరణ పరిరక్షకుడు దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు: కాపు సీతాలక్ష్మీ

 

పర్యావరణ పరిరక్షకుడు దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు: కాపు సీతాలక్ష్మీ

కొత్తగూడెం: పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన “వనజీవి” దరిపల్లి రామయ్య  కన్నుమూశారు. ఈ మేరకు ఆయన మృతిపై కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. "ఇంటి పేరును 'వనజీవి'గా మార్చుకొని, కోటికిపైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించి పద్మశ్రీ అవార్డు అందుకున్న రామయ్య మృతి రాష్ట్రానికీ, దేశానికీ తీరని లోటు" అని అన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా పచ్చదనాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా హరితయాత్ర సాగించిన రామయ్య, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మొక్కలు నాటే పనిని మాత్రం నిలిపివేయలేదని గుర్తుచేశారు.

వారి జీవితం భవిష్యత తరాలకు స్ఫూర్తిదాయకమై, ప్రకృతి పరిరక్షణకు ఓ మార్గదర్శకంగా నిలుస్తుందని కాపు సీతాలక్ష్మి పేర్కొన్నారు. “ధార్శనికుడు, ప్రకృతి మిత్రుడు అయిన రామయ్య మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం” అని తెలిపారు.

Blogger ఆధారితం.