-->

ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గది మరియు వాష్ రూమ్స్ ప్రారంభోత్సవం

ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గది మరియు వాష్ రూమ్స్ ప్రారంభోత్సవం


నవ లిమిటెడ్ నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేశవపురం నందు అదనపు తరగతి గది మరియు వాష్ రూమ్స్ ప్రారంభోత్సవం. నవ లిమిటెడ్ పాల్వంచ తన సామాజిక కార్యకలాపాలలో భాగంగా మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల కేశవపురం నందు నిర్మించిన అదనపు తరగతి గదులు మరియు వాష్ రూమ్స్ ప్రారంభించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

ఈ కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హతిరామ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మౌలిక సదుపాయములు కల్పించడంలో నవ లిమిటెడ్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. జనరల్ మేనేజర్ సి ఎస్ ఆర్ ఎం జి ఎం ప్రసాద్ మాట్లాడుతూ నవ లిమిటెడ్ వారు చేపట్టే ఆరోగ్యం, విద్య, జీవనోపాదుల కార్యక్రమాలను వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా పలు ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థితిని అధిరోహించాలని కోరారు. 

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. 

ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రామమూర్తి, పాల్వంచ, తహసిల్దార్ వివేక్, డీ.సి ఎం చైర్మన్ కే శ్రీనివాసరావు, లైసెన్ ఆఫీసర్ ఖాదరేంద్రబాబు, ఎన్. శ్రీనివాస్ సివిల్ ఇంజనీర్, సిహెచ్ శ్రీనివాసరావు, ఏ పి పి రమేష్, షాబీర్ పాషా మరియు ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Blogger ఆధారితం.